కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. వరుస ఫ్లాప్‌లతో ఉన్న ప్రభాస్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే తొలుత ఈ సినిమాని వరల్డ్ వైడ్‌గా దాదాపు 1900కి పైగా లొకేషన్స్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే రిలీజ్ డేట్ వాయిదా పడటంతో లొకేషన్స్ కూడా భారీగా తగ్గాయి. ముఖ్యంగా యుఎస్‌లో డిస్ట్రిబ్యూటర్స్ సలారు విడుదల అంటే చేతులెత్తేస్తున్నారు. మేకర్స్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు.
ఇక యూఎస్ ఐ మ్యాక్స్‌లో సలార్ విడుదలకు బ్రేక్ పడింది. చాలా మంది ఆడియన్స్ సలార్‌ని బిగ్ స్క్రిన్స్లో చూడాలని కలలు కన్నా వారికి నిరాశే ఎదురైంది. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అన్న నేపథ్యంలో సినిమా తెరకెక్కింది.