వైసీపీ నుండి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు షాకేనా…?వారి సీట్ల విషయంలో చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు..?నలుగురిలో ఇద్దికి షాకివ్వడం ఖాయమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019లో వైసీపీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఇందులో నెల్లూరు రూరల్ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.
అయితే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు టీడీపీ సిట్టింగ్‌లతో పాటు వైసీపీ నుండి చేరిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరికి సీటు ఇవ్వడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,ఆనం రాంనారయణరెడ్డికి తిరిగి సీట్లు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆనంను మరో స్థానంకు మార్చనున్నారని తెలుస్తోంది. ఆత్మకూరు లేదా సర్వేపల్లి స్థానాలకు ఆనం పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక మిగిలిన ఇద్దరు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు సీటు దక్కడం కష్టమేనని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఎందుకంటే స్థారికంగా వారికి అనుకూల పరిస్థితులు లేవని, ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో వీరికి ప్రత్యామ్నాయం చూడటమా లేదా అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ అనే హామీ ఇస్తారని టాక్ నడుస్తోంది. అలాగే పలువురు సీనియర్లకు స్థాన చలనంతో పాటు సీటు దక్కకుంటే ప్రత్యామ్నాయం చూస్తానని బాబు హామీ ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు తగిన శాస్త్రి జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
