ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిపోతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ ఊహించని నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. గెలుపు గుర్రాలు, సామాజిక సమీకరణలను బేరీజు వేస్తూ ఇంఛార్జీలను నియమిస్తున్నారు. ఇక ఇప్పటికే పలు జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జీలను నియమించగా తాజాగా జగన్ తన సొంత జిల్లాల్లో సైతం మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయించాలని భావిస్తున్నారు. కడప నుండి రెండు సార్లు ఎంపీగా గెలిచారు అవినాష్ రెడ్డి. ఈసారి జమ్మలమడుగు నుండి అవినాష్‌ను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. అవినాష్ పోటికి దిగడం ఖాయమైతే అ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని టాక్.
అవినాష్ అసెంబ్లీ బరిలో దిగితే కడప ఎంపీగా డాక్టర్ అభిషేక్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి తనయుడు డాక్టర్ అభిషేక్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా అప్పుడు ఆయన పోటీ చేయలేదు. అభిషేక్‌రెడ్డి ప్రస్తుతం సింహాద్రిపురం, లింగాల మండలాల బాధ్యతలు చూస్తున్నారు.అలాగే సీఎం జగన్ కు బంధువు అయిన దుష్యంత్ రెడ్డికి కమలాపురం సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కడప జిల్లాలో వారసుల ఎంట్రీ వార్త చర్చనీయాంశంగా మారింది.