Saturday, May 10, 2025
- Advertisement -

వైసీపీ..పెద్దల సభలకు వెళ్లేది వీరే

- Advertisement -

ఏపీలో త్వరలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుండగా వీరి స్థానంలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాసులను అభ్యర్థులుగా ఖరారు చేశారు.

గొల్ల బాబూరావు ఎస్సీ, జంగాలపల్లి శ్రీనివాస్ బలిజ సామాజిక వర్గాలను చెందిన వారు. ప్రస్తుతం గొల్ల బాబూరావు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో పాటు వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జీ,తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా గతంలో పనిచేసిన వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తుండగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. మరికొంతమంది సిట్టింగ్‌లకు సీటు నిరాకరించారు జగన్‌. సీటు దక్కని నేతలకు నామినేట్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు జగన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -