మహేష్ అభిమానులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న చిత్రం గుంటూరు కారం. రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలతో భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇక తాజాగా సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు మేకిండ్ వీడియోని రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
వీడియో చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫైటింగ్ సీన్స్ చిత్రీకరణలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించగా మాస్ ప్రేక్షకులకు మరింత నచ్చేలా ఉంది ఈ సినిమా. మేకింగ్ వీడియో చూస్తే మహేష్ సంక్రాంతికి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మహేష్‌కి జోడీగా శ్రీలీల నటించగా మీనాక్షి చౌదరి,రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్, జగపతిబాబులు కీలక పాత్రలను పోషించారు.
తమన్ సంగీతం అందించగా హారిక క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ముఖ్యంగా సినిమాలో సాంగ్స్ కుర్చీ మడతపెట్టికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసిన ఈ పాట మోత మోగిస్తోంది. ఇక ప్రీ రిలీజ్ సందర్భంగా మహేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ని నింపాయి. మొత్తంగా సంక్రాంతి రేసులో వస్తున్న తొలి చిత్రం గుంటూరు కారం హిట్ కొడుతుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.