Sunday, April 28, 2024
- Advertisement -

హీరో నితిన్‌కు ప్రమాదం?

- Advertisement -

హీరో నితిన్ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారా?,యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా నితిన్‌కు గాయమైందా?అందుకే షూటింగ్‌ నుండి బ్రేక్ తీసుకున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న హీరో నితిన్ ప్రస్తుతం తమ్ముడు సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తున్న సమయంలో నితిన్ చేతికి గాయాలయ్యాయని తెలుస్తోంది. డాక్టర్లు మూడు వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించడంతో నితిన్ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే నితిన్ నిజంగా గాయపడ్డారా లేదా అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే నితిన్ కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారని అందుకోసమే వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించారని మరికొంతమంది చెబుతున్నారు. ఏదిఏమైనా నితిన్ షూటింగ్‌కు బ్రేక్ తీసుకోవడం మాత్రం టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా తెరకెక్కుతుండగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. నితిన్ సరసన సప్తమీ గౌడ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -