శ్రద్ధా దాస్..టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు శ్రద్ధా. తన అందచందాలను ఆరబోస్తూ యూత్ గుండెలను పీండెస్తోంది. అందుకే ఎంతమంది హాటు భామలు ఉన్నా శ్రద్ధా లెవలే వేరు. శ్రద్ధా దాస్ ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే చాలు సోషల్ మీడియా షేకవడం ఖాయం.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి అడపదడపా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ హీరోయిన్‌గా మారి 15 సంవత్సరాలు అవుతోంది. అయితే తాజాగా శ్రద్ధా..ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని వార్తలు టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో దీనిపై స్పందించారు శ్రద్ధా. తనపై వస్తున్నవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. తాను ఎవరితోను డేటింగ్‌లో లేనని తేల్చి చెప్పారు. 2008 లో సిద్దూ ఫ్రమ్ సికాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తర్వాత మళయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రియాలిటీ షోలు, ఈవెంట్స్‌తో బిజీగా ఉన్నారు.
