Friday, May 9, 2025
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ మరో గుడ్‌న్యూస్..

- Advertisement -

ఏపీ సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత నిధులను స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు నేరుగా విడుదల కానున్నాయి. సీఎం జగన్‌ ఉరవకొండలో 23న లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 2019 ఏప్రిల్ 11 వరకు మహిళలు తీసుకున్న రుణాలను 4 దశలో ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు సీఎం జగన్. చెప్పినట్లుగానే అర్హుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు.

దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. డ్వాక్రా గ్రూపులో సభ్యురాలై ఉండాలి. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, లోన్ డాక్యుమెంట్ ఉండాలి. నివాస రుజువు పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -