Sunday, May 4, 2025
- Advertisement -

టిల్లు స్క్వేర్..రిలీజ్ డేట్ పిక్స్!

- Advertisement -

డీజే టిల్లు..చిన్న సినిమా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డను ఓవర్‌నైట్‌లో స్టార్‌ని చేసేసింది. తెలంగాణ యాసలో అదరగొట్టాడు సిద్దు. ఈ సినిమాకు సీక్వెల్గా టిల్లు స్వ్కేర్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా విడుదల తేదీని కూడా గతేడాది ఆగస్టు 11నే ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.

అయితే తాజాగా కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా టిల్లు స్వ్కేర్ విడుదల కానుంది అనుపమ పరమేశ్వరన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని కూడా షేర్ చేశారు.

తొలుత గతేడాది ఆగస్టు 11న, ఆ తర్వాత సెప్టెంబర్ 15 అని ప్రకటించారు. అయితే సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫామ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -