క్రికెట్ హిస్టరీలో మూడు ఫార్మాట్లలో సత్తా చాటిన టీమ్‌లు, ఆటగాళ్లలో టీమిండియాది ప్రత్యేక స్థానం. వన్డే, టీ20,టెస్ట్ ఫార్మాట్..ఇలా ఏ ఫార్మాటైన భారత ఆటగాళ్లు సత్తాచాటారు. ఇందులో విరాట్ కోహ్లీది ప్రత్యేక స్థానం. మూడు ఫార్మాట్లలో నెంబర్ 1 ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. రెండుసార్లు 2013,2018లో టెస్ట్ , వన్డే , టీ20ల్లో నెంబర్ 1 ఆటగాడిగా నిలిచాడు విరాట్.
ఇలా అన్ని ఫార్మాట్‌లలో నెంబర్ 1గా నిలిచిన ఆటగాళ్లలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ హెడెన్‌తో పాటు రికీ పాంటింగ్ కూడా ఉన్నారు. నెంబర్ ఒన్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. 2018 లోనూ ఇదే ర్యాంకింగ్స్ ను సొంతం చేసుకున్నాడు.
అయితే మూడు ఫార్మాట్లలో నెంబర్ ఒన్ స్థానాన్ని చేరుకున్న ఇండియన్ బౌలర్ బుమ్రా ఒక్కడే. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ సత్తా చాటిన బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు.
