తొలి జాబితాలో లేని పవన్‌ పేరు!

టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 118 స్థానాలతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు – జనసేన అధినేత పవన్ ఉమ్మడిగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇక పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది అని పవన్ తెలిపారు. అయితే ఫస్ట్ లిస్ట్‌లో పవన్‌ పేరు లేకపోవడం గమనార్హం. ఎక్కడి నుండి పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు పవన్‌ను ప్రశ్నించగా నవ్వుకుంటూ సమాధానం దాటవేశారు.

ఇక తొలి జాబితాలో చోటు దక్కించుకున్న జనసేన అభ్యర్థులను పరిశీలిస్తే నెల్లిమర్ల : శ్రీమతి లోకం మాధవి,అనకాపల్లి: కొణతాల రామకృష్ణ,రాజానగరం : బత్తుల బలరామకృష్ణ,కాకినాడ రూరల్: పంతం నానాజీ,తెనాలి: నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

అయితే పవన్ ఒక స్థానం భీమవరం నుండి పోటీ చేయడం దాదాపు ఖరారు కాగా ఎందుకు సస్పెన్స్‌గా ఉంచారో తెలియాల్సి ఉంది. బీజేపీతో పొత్తు ఖరారైన ఆ పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తారనే దానిపై కూడా చంద్రబాబు దాటవేసే పరిస్థితి నెలకొంది.