Sunday, April 28, 2024
- Advertisement -

పార్టీలే వేరు..నలుగురి ఏజెండా ఒక్కటే!

- Advertisement -

చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తోంది ఏపీ నాన్ రెసిడెంట్స్. సీఎం జగన్ పదే పదే చెప్పే విషయం ఇది. వాస్తవం ఇదే. చంద్రబాబు ఒంటరిగా రాలేక తనకు తోడుగా సరసమైన ప్యాకేజీలతో తెచ్చుకున్న వారికి డ్యూటీలు కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నారు. జగన్ పై నిత్యం తన గ్యాంగ్ నుంచి ఒకరు ఏపీ కేంద్రంగా బురద చల్లటమే లక్ష్యంగా వారికి విధులు కేటాయిస్తున్నారు. ఎవరినీ కంటిన్యూగా డ్యూటీ చేయనీయరు. ఒకరి ప్రవేశంత మరొకరు డ్యూటీ నుంచి రిలీవ్ అవుతారు. ఫిబ్రవరి నెలలో ఏపీలో పర్యటించిన చంద్రబాబు గ్యాంగ్ వివరాలు చూస్తే ఇది ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నారో స్పష్టమవుతోంది.

చంద్రబాబు తాను కదలి రా సభలు..పార్టీ సమావేశాల సమయంలో మాత్రం గ్యాంగ్ సభ్యులు ఏపీలో కనిపించరు. ఫిబ్రవరి 5న చంద్రబాబు చింతలపూడి సభలో పాల్గొన్నారు. అంతకు ముందురోజు 4వ తేదీ వరకు మంగళగిరిలో ఉన్న దత్తపుత్రుడు చంద్రబాబుకు రూట్ క్లియర్ చేస్తూ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫిబ్రవరి 6 చంద్రబాబు గంగాధర నెల్లూరు మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో అందరికీ సెలవు. ఎవరి మీటింగ్ ఉండదు మిగిలిన వారు టీవీ లలో కనిపించరు. ఫిబ్రవరి 7 నుండి 10 వరకు షర్మిల ఏపీలో డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లగా..పవన్ హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఇక, చంద్రబాబు అప్పచెప్పిన విధుల నిర్వహణలో భాగంగా షర్మిలక్క బాపట్ల , గుంటూరు , ఏలూరు తుని , చాగల్లు లో పర్యటించారు.

ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు లోకేష్ సంకారావం (శంఖారావం) సభల్లో పాల్గొన్నారు. మిగిలిన వారు ఉంటే తన సొంత పుత్రుడికి మైలేజ్ తగ్గుదుందనే భావనతో పవన్, షర్మిలకు చంద్రబాబు సెలవు ఇచ్చారు. ఇక, చంద్రబాబు 17న పర్చూరు మీటింగ్ కోసం ఎంట్రీ ఇచ్చారు. లోకేష్ తన టూర్ కు గ్యాప్ ఇచ్చి హైదరాబాద్ వెళ్లారు. 18న గ్యాంగ్ మొత్తానికి సెలవు. ఫిబ్రవరి 19 మళ్ళీ లోకేష్ విశాఖలో దర్శనమిచ్చారు. తరువాత ఫిబ్రవరి 20 న పవన్ రాజమండ్రి లో ఎంట్రీ ఇచ్చారు. అంతే, విశాఖ నుంచి నారా లోకేష్ ఎగ్జిట్ అయ్యారు. పవన్ విశాఖ, రాజమండ్రి, భీమవరంలో తనకు అప్పగించిన అస్సైన్ మెంట్ పూర్తి చేసి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక షర్మిల డ్యూటీ మొదలైంది. అదే రోజు రాత్రి పార్టీ కార్యాలయంలో నిద్ర..22న విజయవాడలో ధర్నా పేరుతో హైడ్రామా క్రియేట్ చేసారు. మిగిలిన ముగ్గురూ సైలెన్స్. ఇది కదా చంద్రబాబు డ్రామా కంపెనీ..అందులోని ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్. వీరికి మద్దతు మీడియా భజన. ఇదీ వీళ్లు ఎన్నికలు చేసే విధానం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -