టీడీపీ ఉపాధ్యక్షుడిగా పవన్‌?

టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్‌పై తనదైన శైలీలో స్పందించారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోందని…24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా? అని ప్రశ్నించారు. 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారని మండిపడ్డారు.

పవన్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని.. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి దిగజారిపోయారన్నారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు… పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవు అన్నారు. జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని.. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు అన్నారు.

తాను పోటీ చేసే స్ధానంపైనా పవన్ కు క్లారిటీ లేదని… జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారన్నారు. పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని… 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరన్నారు. పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని… రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు అన్నారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేసినా మాకు ఇబ్బంది లేదని..వైసీపీదే విజయం అన్నారు.