Sunday, April 28, 2024
- Advertisement -

వారసుల కోసం నేతల తండ్లాట!

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో దూకుడు పెంచింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు గాను మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మిగిలిన 16 స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా గట్టి పోటీ నెలకొంది. ఇక ఇందులో పది సీట్లకు పైగా స్థానాల్లో తమ వారసులకే టికెట్లు ఇవ్వాలని సీనియర్ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు.

మొత్తంగా 17 ఎంపీ స్థానాలకు గానూ 800కి పైగా దరఖాస్తులు రాగా వీటిలో నేతల తనయులు ఉన్నారు. నల్గొండ ఎంపీ స్థానం నుండి తన కుమారుడికి సీటు కోసం పెద్దలు జానారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జానా చిన్న కొడుకు రఘువీర్ మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఖమ్మం సీటు కాంగ్రెస్‌లో హాట్ కేక్‌లో మారింది. ఈ ఎంపీ స్థానానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాదరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అలాగే మెదక్ సీటు కోసం మైనంపల్లి హన్మంతరావు, జగ్గారెడ్డి భార్య నిర్మల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి వివేక్ తనయుడు వంశీ పోటీ పడుతున్నారు. భువనగిరి ఎంపీ స్థానంలో రాజగోపాల్ రెడ్డి తన సతీమణిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెవెళ్ల పార్లమెంటు నుంచి పట్నం మహేందర్‌రెడ్డి భార్య సునీతా మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇలా కాంగ్రెస్‌లో టికెట్ల కోసం సీనియర్ నాయకులు తమ వారసుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -