Sunday, May 19, 2024
- Advertisement -

వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా:సీఎం జగన్

- Advertisement -

ఎన్నికల తర్వాత వైజాగ్‌లోనే ఉంటాను…వైజాగ్‌లోనే ప్రమాణస్వీకారం చేస్తాను అని తెలిపారు సీఎం జగన్. దేశంలోని మిగితా నగరాలతో వైజాగ్ అభివృద్ధిలో పోటీ పడుతుందన్నారు. ఏపీ డెవలప్‌మెంట్ సదస్సులో పాల్గొని మాట్లాడిన జగన్…వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కొల్పోయినా….ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా ఉందన్నారు. హైదరాబాద్ కంటే వేగంగా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు.

రాష్ట్రానికి బ్యాక్ బోన్‌గా విశాఖ పట్నం ఉందని… ఓవైపు అభివృద్ధిని కొనసాగిస్తూనే ముఖ్యమైన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామన్నారు. చాలా రంగాల్లో దేశంలోని ఇతర్రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మెరుగైన స్థానంలో ఉందన్నారు.రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం, పోర్టులు రాష్ట్రాభివృద్ధికి సాయపడుతున్నాయని వివరించారు.

ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని…ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గి…ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని..కొంతమంది పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -