భైరవగా ప్రభాస్..అదిరిపోయింది

మహాశివరాత్రి సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరే ట్రీట్ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ పాత్ర పేరును భైరవను పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవని పరిచయం చేస్తున్నామని పోస్టర్‌లో వెల్లడించింది.

ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. మంచి శరీరాకృతితో కాల భైరవ వలె విధ్వంసకరంగా కనిపిస్తుండగా, బ్యాగ్ గ్రౌండ్ లో భవిష్యత్తు కాశీ కనిపిస్తోంది. కల్కి 2898 AD కథ 3101 BCEలో మహాభారత పురాణ సంఘటనల నుండి 2898 AD కాలల మధ్య ఉండనుంది.

వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ప్రభాస్ – దిశా మధ్య సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. లోకనాయకుడు కమల్ విలన్‌గా నటిస్తుండగా అమితాబ్,దీపికా,రానా,రాజమౌళి తదితరులు నటిస్తున్నారు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.