Monday, April 29, 2024
- Advertisement -

NBK 109…ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?

- Advertisement -

బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహా శివరాత్రి సందర్భంగా NBK109 నుండి ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు మేకర్స్‌. సినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొనగా ఈ గ్లింప్స్‌ ఆ అంచనాలను పెంచేసింది.

గ్లింప్స్‌లో కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టారు బాలయ్య. టూల్ బాక్స్‌లో ఆయుధాలతో పాటు మాన్షన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్‌ ని తీసుకెళ్లడం చూపించారు. గూండాలు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తుంటే, బాలయ్య కూల్ గా ఆల్కహాల్ తాగడం ఆకట్టుకుంది.

ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?, సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్, కల్ట్ సరుకు డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -