Wednesday, May 8, 2024
- Advertisement -

రామ్ చరణ్ బర్త్ డే..విజువల్ ట్రీట్

- Advertisement -

సార్ట డైరెక్టర్ శంకర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సినిమా నుండి విజువల్ ట్రీట్‌ను రిలీజ్ చేశారు.

గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ జరగండి జరగండిని రిలీజ్ చేశారు. 158 థియేటర్లలో ఈ సాంగ్‌ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. శంకర్ మార్క్ పనితనం, రామ్ చరణ్ డ్యాన్స్ విజువల్ ట్రీటే. తమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లో ఇది 50వ సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -