Saturday, April 27, 2024
- Advertisement -

కల్కి 2898ఏడీ..రిలీజ్‌పై క్లారిటీ!

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ చిత్రం తొలుత మే 9న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై రెండు మూడు రోజుల్లో మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ప్రభాస్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీ రోల్ పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా అశ్వనీదత్ భారీ వ్యయంతో విజువల్ ట్రీట్‌గా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -