పొద్దు తిరుగుడు గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాల నూనె కాదు.. పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆకులు, వేరు కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
పొద్దు తిరుగుడు గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పొద్దు తిరుగుడు పలుకుల్లో విటమిన్ ఈ, ఫ్లేవనాయిడ్ల వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ల నివారించడం లో తోడ్పడుతాయి.
వీటిల్లోని లినోలిక్ ఆమ్లం క్యాన్సర్ నిరోధక కొవ్వు ఆమ్లంగా పనిచేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో తేలింది. నువ్వులు, వేరుశెనగలు, అవిసె గింజలతో పోలిస్తే పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఈ ఆమ్లం మోతాదు ఎక్కువగా ఉంటుంది. అందుకే పొద్దుతిరుగుడు గింజలు క్యాన్సర్ నిరోధకంగానే కాదు, కణస్థాయిలో వాపు ప్రక్రియ తగ్గటానికి సాయం చేస్తుంది. గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది.
