తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదన్నారు బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్..కేంద్రంలో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని తెలిపారు.
రైతు రుణమాఫీపై దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదని ..ఆగస్టు తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి సంక్షోభంలోకి వెళ్లబోతోందని తేల్చిచెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని..ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయక తప్పదన్నారు. రైతు రుణమాఫీపై దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డికి.. ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం ఉండబోతుందన్నారు.
ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ దక్కిందన్నారు. ఏకపక్షంగా ఇతర పార్టీలని కాదని ఓటర్లు నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపారని, ఆయనపై నమ్మకంతో ఓటు వేశారని చెప్పారు.
