Sunday, May 11, 2025
- Advertisement -

శింగనమల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

- Advertisement -

ఏపీ ఎన్నికల రిజల్ట్స్ సంగతేమో కానీ సెంటిమెంట్ పేరుతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నెటిజన్లు. పలనా చోట గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదని, ఈ స్థానంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం అని చర్చ జరుగుతోంది. ప్రధానంగా రాయలసీమలోని శింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం. దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతుండగా ఈసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందో చూడాలి.

గత ఎన్నికలలో టిడిపి అభ్యర్థి బండారు శ్రావణిపై వైసీపీ అభ్యర్థి పద్మావతి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈసారి వైసీపీ తరపున వీరాంజనేయులు బరిలో ఉండగా టీడీపీ నుండి బండారు శ్రావణి పోటీ చేశారు. నియోజవర్గంలో 2,47,373 మంది ఓటర్లు ఉండగా.. 2,05,068 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం పెరగడంతో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందా అన్న టెన్షన్ మాత్రం అందరిలో నెలకొంది.

2014లో ఇక్కడి నుండి టీడీపీ గెలుపొందగా ఆ పార్టీనే అధికారం వరించింది. 2009లో కాంగ్రెస్ నుండి శైలజనాథ్ పోటీ చేసి గెలవగా హస్తం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. 2004లో కాంగ్రెస్, 1999లో టిడిపి గెలవగా ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. మరి ఈసారి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -