- Advertisement -

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫుల్ క్లారిటీ!

- Advertisement -

కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అవి రూమర్స్‌గానే మిగిలిపోతుండగా తాజాగా బాలయ్యే క్లారిటీ ఇచ్చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన బాలయ్య…మా అబ్బాయి మోక్షు కూడా పరిశ్రమకి రావాలన్నారు. తను కూడా విష్వక్, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటా అని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

అంతేగాదు తపన ఉన్న నిర్మాత వంశీ…. మరో మంచి కలయిక ఉంది. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నాం అని గుడ్ న్యూస్ చెప్పేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోగా ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది.

ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్నూ,విశ్వక్‌ ని కవలలే అని అంటుంటారని కొనియాడారు బాలయ్య. కొంతమందితోనే నేను సన్నిహితంగా ఉంటా. అందులో విశ్వక్‌ ఒకడు. నాలాగే ఉడుకు రక్తం, దూకుడు ఉన్న వ్యక్తి అని ప్రశంసలు గుప్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -