నందమూరి బాలయ్య హ్యాట్రిక్ కల నెరవేరేనా?,హిందూపుర్ టీడీపీ కంచుకోటను వైసీపీ బద్దలు కొడుతుందా?,ఆపరేషన్ బాలయ్య ఏ మేరకు సక్సెస్ అయింది..?ఇప్పుడు ఇదే హిందూపుర్‌లో చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ కంచుకోట హిందూపూర్. 1983 నుండి ఆ పార్టీకి ఇక్కడ ఎదురేలేదు. ఎన్టీఆర్ దగ్గరి నుండి హరికృష్ణ,బాలయ్య వరకు నందమూరి కుటుంబ సభ్యులే ఇక్కడి నుండి గెలుస్తూ వస్తున్నారు.2014,2019లో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు బాలయ్య. తాజాగా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇక ఈసారి బాలయ్యను ఎదుర్కొనేందుకు వైసీపీ పక్కా వ్యూహంతో సిద్ధమైంది. మహిళా అభ్యర్థి దీపికను బరిలో దించారు జగన్.
ఇక ఎన్నికల ప్రచారంలో అసంతృప్తులను ఏకతాటి పైకి తీసుకురావడంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్రచారంలో బాలయ్యను ధీటుగా ఎదుర్కొనేది తానేననే సంకేతాలను ప్రజలకు ఇచ్చారు దీపిక. దీనికి తోడు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయనే ధీమాతో ఉండగా టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని మూడోసారి నిలబెట్టుకుంటానని చెబుతున్నారు బాలయ్య. అయితే ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారనేది జూన్ 4న తేలనుండగా ఎవరు గెలిచినా సెన్సేషనే అని చెప్పుకోవాలి.
