- Advertisement -
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో హిట్ కొట్టారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో తొలిరోజు వసూళ్ల సునామీ సృష్టించింది. విశ్వక్ సేన్ సరసన నేహశెట్టి హీరోయిన్‌గా నటించగా అంజలి కీలక పాత్ర పోషించారు.
ముఖ్యంగా సినిమాలో విశ్వక్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. దీంతో తొలిరోజు 8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్.సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసేయడంతో డల్ అయిన సినీ పరిశ్రమకు ఓపెన్ చేసిన తర్వాత ఓ సినిమాకు ఇంత కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. అది కూడా సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ రావడం గమనార్హం.
దాస్ కా ధమ్కీ, గామి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి మార్కెట్‌లో తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు విశ్వక్.