- Advertisement -
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ చేసిన పని సర్వత్రా విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ అంజలిని తోసెయ్యడం, బాలయ్య కూర్చున్న దగ్గర మందు బాటిల్ ఉండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా బాలయ్య తీరును నెటిజన్లు తప్పుబట్టారు.
దీంతో ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అక్కడ స్టేజి మీద కొంతమంది ఉన్నారు. పక్కకి జరగాలి, వినపడకపోవడంతో క్యాజువల్ గా తోశారు. ఆ వీడియో ముందు, వెనక ఏం జరిగిందో ఎవరు చూడరు. ఆ తోసేయడం చూసి నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
దాని తర్వాత హైఫై ఇచ్చింది ఎవరు షేర్ చెయ్యట్లేదు. కొంతమంది బాలయ్య ని నెగిటివ్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లాన్ చేసి చేస్తున్నారు. దాన్ని ఎందుకు మీరు హైప్ ఇస్తున్నారో అర్ధం కావడం లేదని తెలిపారు నాగవంశీ.
