Sunday, May 11, 2025
- Advertisement -

అసెంబ్లీ స్పీక‌ర్‌గా అయ్యన్న!

- Advertisement -

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యే అవకాశం ఉందని సమాచారం. బుధవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండగా తొలుత ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది.

అనంతరం స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండనుంది. స్పీకర్ పదవి టీడీపీకి, జనసేన పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక స్పీకర్ పదవి రేసులో ప్రధానంగా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే చీఫ్ విప్‌గా ధూళిపాల నరేంద్ర ఎంపిక దాదాపు ఖాయమైనట్లు టీడీపీ వర్గాల సమాచారం.

డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్‌లో జనసేన పార్టీకి ప్రాధాన్యత కల్పించారు చంద్రబాబు. పవన్‌కు డిప్యూటీ సీఎంగా కీలక శాఖలు అప్పజెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -