- Advertisement -

పోచారంతో రేవంత్ భేటీ..కాంగ్రెస్‌లోకి ఆహ్వానం!

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు తొలి షాక్ తగిలింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ సీనియర్ నేత,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

ఇవాళ ఉదయం పోచారంతో రేవంత్ భేటీ కాగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ సందర్భంగా పోచారంను సీఎం రేవంత్ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పినట్లుగానే ఎన్నికల తర్వాత కార్యాచరణ సిద్ధం చేశారు రేవంత్.

ఇప్పటికే కడియం శ్రీహరి,దానం నాగేందర్‌,తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -