టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా తొలి హ్యాట్రిక్ నమోదైంది. సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో పద్దతిలో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా విధించిన 141 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ 11.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.ఈ క్రమంలో వర్షం పడటంతో మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు అంపైర్లు. డేవిడ్ వార్నర్ (55 నాటౌట్), గ్లెన్ మాక్స్‌వెల్ (14 నాటౌట్) పరుగులు చేశారు.
ఇక అంతకముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. షాంటో (41), తౌహిద్ (40) పరుగులు చేయగా కమిన్స్ మూడు వికెట్లు, ఆడమ్ జంపా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతికి మహ్మదుల్లా, ఆరో బంతికి (మెహిది హసన్).. ఆతర్వాత 20వ ఓవర్ తొలి బంతికి తౌహిద్ హృదోయ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ తీశాడు. ఆసీస్ తరపున టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు కమిన్స్. 2007లో బంగ్లాదేశ్‌పైనే హ్యాట్రిక్ తీశాడు బ్రెట్ లీ.
