ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరుగులేని మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 స్ధానాల్లో గెలుపొందింది టీడీపీ కూటమి. అంటే దాదాపు 90 శాతం స్థానాల్లో గెలుపు కూటమిదే. అయినా చంద్రబాబుకు కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకుని మరింత బలం పెంచుకునేలా కార్యచరణ రెడీ చేస్తున్నారు.
ముఖ్యంగా టీడీపీకి పట్టు ఉన్న జిల్లాల్లో ఒకటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. పార్టీపై ఎంత వ్యతిరేకత ఉన్నా ఇక్కడ చెప్పుకొదగ్గ స్థానాల్లో విజయం సాధించడం ఖాయం. గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసినా చంద్రబాబు మనసు మాత్రం వైసీపీ నేతలపైనే ఉంది. వారే ధర్మాన బ్రదర్స్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. ధర్మాన సోదరులు వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలు కాగా తమ్మినేని కళింగ సామాజిక వర్గ నేత. ఈ ముగ్గురు తమ సామాజివర్గంలో తిరుగులేని నేతలు.
దీంతో ఈ ముగ్గురిని వైసీపీకి దూరం చేసి టీడీపీలో చేర్చుకునేందుకు టీడీపీ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా టీడీపీ నేతలు వీరితో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతీగా ప్రభుత్వంలో మంచి పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాదు వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వీరికి గాని వీరి వారసులకు గాని అవకాశం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు నేతలు మాత్రం వైసీపీ వీడేందుకు రెడీ లేరని తెలుస్తోంది. మొత్తంగా 90 శాతం ఎమ్మెల్యేలు ఉన్నా ఇంకా వైసీపీ నేతలపైనే చంద్రబాబు ఆధారపడటం మాత్రం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.