- Advertisement -

టీటీడీ…చంద్రబాబుకు కొత్త తలనొప్పి!

- Advertisement -

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది సీనియర్ నేతలు నామినేటెడ్ పోస్టుల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలె 20 నామినేటెడ్ పోస్టులను భర్తి చేసిన చంద్రబాబు..ఇందులో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒక నామినేటెడ్ పోస్టు కేటాయించారు.

అయితే అంతా ప్రధానంగా ఎదురుచూస్తోంది టీటీడీ ఛైర్మన్‌ గిరి కోసం. టీడీపీ నేతలే కాదు బీజేపీ, జనసేన నేతలు సైతం ఈ పదవి దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఇదే టీడీపీ అధినేతకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది.

తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డారు చంద్రబాబు. కల్తీ నెయ్యి అంటూ ఫేక్ సర్టిఫికేట్ చూపించి చిక్కుల్లో పడ్డ చంద్రబాబు…ఈ అంశం నుండి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో బోర్డు నియామకం ఉండదనే టాక్‌ వినిపిస్తోంది.

అయితే ఆశావాహులు మాత్రం తమ ప్రయత్నాలను మాత్రం వీడటం లేదు. ప్రముఖంగా టీడీ జనార్దన్‌రావు , ఓ రిటైర్డ్‌ న్యాయమూర్తి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, సీనియర్‌ ఎమ్మెల్యే కళావెంకటరావు పేర్లు వినిపిస్తున్న సిట దర్యాప్తు ఓ కొలిక్కి వస్తేనే టీటీడీ చైర్మన్ నియామకం ఉంటుందనే తెలుస్తోంది.

లడ్డూ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత టీటీడీని ధార్మిక సంఘాలకు అప్పగించాలని కొంతమంది, రాజకీయాలతో సంబంధం లేనివారికి టీటీడీలో పదవులు కట్టబెట్టాలని హిందూ సంఘాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలకవర్గ నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -