ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం తన వంతుగా కోటి రూపాయల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రజలు కూడా తమ వంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు జగన్. దీంతో పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తోంది. పెద్దల నుంచి చిన్నారుల వరకు అంతా వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.
తాజాగా ఉయ్యూరుకు చెందిన రాజులపాటి అభయ్‌రామ్ అనే చిన్నారి తను కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.10వేలను వరద బాధితుల సహాయార్థం వైయస్ జగన్ కి అందించారు. ఉయ్యూరులో ఒకటో తరగతి చదువుతున్న అభయ్‌రామ్ తన తండ్రి రామచంద్రరావు, పెనమలూరు వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తితో కలిసి వచ్చి జగన్‌గారిని కలిశారు. ఈ సందర్భంగా అభయ్ రామ్‌ను భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని జగన్ సూచించారు.
అలాగే వరద సహాయక చర్యల నిమిత్తం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడికి చెందిన వైయస్ఆర్‌సీపీ నేత కట్టా మహేష్ రూ.50వేల చెక్కును వైఎస్ జగన్‌కి అందించారు.