ఏపీ పదోతరగతి ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా ఈ ఫలితాల్లో సంచలనం నమోదైంది. పదోతరగతి ఫలితాల్లో 600కు 600 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ చరిత్రలో సంచలనం సృష్టించింది ఓ విద్యార్థిని. కాకినాడకు చెందిన నేహాంజని ఏకంగా 600 మార్కులకు 600 మార్కులు సంపాదించి చరిత్ర సృష్టించింది.
ఈ ఏడాది మొత్తం 6,14,490 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా, అందులో 4,98,895 మంది పాస్ అయ్యారు. ఇక ఒక విద్యార్థినికి 600కు గాను 600 మార్కులు వస్తే మరొక విద్యార్థికి కేవలం 1 మార్కు మాత్రమే వచ్చింది. విద్యార్థి పేరు గోప్యత కారణంగా వెల్లడించలేదు. పరీక్షలు రాసిన అన్ని సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 600లో 1 మార్కు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ద్వారా చూసి, మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
