- Advertisement -

గణేశ్‌ లడ్డూ ఏకంగా రూ.కోటి 87 లక్షలు

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నిమజ్జనం ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుడి నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక గణేశ్ నిమజ్జనం అనగానే గుర్తుకొచ్చేది లడ్డూ వేలం పాట. అందరి దృష్టి హైదరాబాద్ బాలాపూర్ లడ్డు వేలం పాట వైపే ఉండగా తాజాగా ఆ లడ్డూ రికార్డును బ్రేక్ చేసింది బండ్లగూడ గణేష్ లడ్డూ వేలంపాట. భాగ్యనగరంలోనే రికార్డ్ స్థాయిలో వేలంపాట సాగింది.

బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణపతి లడ్డూ ధర ఏకంగా కోటి 87 లక్షల రూపాయిలు పలికింది. ఈ లడ్డూని 25మంది సభ్యులు బృందంగా ఏర్పడి దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బుతో ట్రస్ట్‌ పేదలకు సహాయం చేయనున్నారు. పేద ప్రజలు, హాస్టల్స్‌లోని విద్యార్ధులకు సహాయ సహకారాలు అందించనున్నారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గతేడాది కోటి 26 లక్షల రూపాయల పలకగా.. ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేయడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -