- Advertisement -

బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర

- Advertisement -

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. గతేడాది కంటే 3 లక్షలు ఎక్కువ ధర పలికింది. కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు. వేలం అనంతరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు.

గతేడాది హైదరాబాద్ శివారు తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి 27 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 1994లో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభం కాగా తొలిసారి బాలాపూర్‌కే చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కు లడ్డూను దక్కించుకున్నారు.

ఇక తాజాగా బాలాపూల్ లడ్డూ వేలం పాట ప్రారంభమై 30 సంవత్సరాలు కాగా 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూ ధర పలకడం విశేషం. 2016లో రూ.14.65 లక్షలు చేరి సరికొత్త రికార్డ్ సృష్టించగా ఆ తర్వాత నుండి 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు,2019లో 17.60 లక్షలు, 2021లో రూ.18.90 లక్షలు,2022లో రూ.24.60 లక్షలు పలికింది. 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -