ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు అతిశీ మర్లెనా. ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో అతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా అమోదించారు. దీంతో ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడో మహిళగా నిలవనున్నారు అతిశీ. అంతకముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంలుగా పనిచేశారు.
ఇవాళ సాయంత్రం సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనాతో సమావేశం కానున్నారు కేజ్రీవాల్. అనంతరం తన రాజీనామాను సమర్పించనున్నారు. అంనతరం నూతన సీఎంగా అతిశీ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ ప్రతిపాదనను, ఎమ్మెల్యే మద్దతును ఎల్జేకు అందజేయనున్నారు.
వాస్తవానికి ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే కేజ్రీవాల్ మాత్రం అతిశీ పేరును ప్రతిపాదించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా అతిశీ ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2023లో కేజ్రీవాల్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా తాజాగా ఏడాది తరువాత 2024లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు అతిశీ.
