పార్టీ గీత దాటిన వారిపై కఠన చర్యలు తీసుకుంటున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సమర్ధవంతంగా వినిపించేందుకు పార్టీలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టిన జగన్..నాయకులకు బాధ్యతలు అప్పజెప్పారు. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై వేటు వేస్తున్నారు.
మాజీ మంత్రి రోజా ఇంఛార్జీగా ఉన్న నగరి నియోజకవర్గంలో కేజే శాంతి, కుమార్ దంపతుల్ని సస్పెండ్ చేశారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్సీపై వేటు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదులు రాగా విచారణ జరిపిన జగన్…మేకా శేషుబాబును పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజును నియమించారు.
2014 ఎన్నికల్లో పాలకొల్లు నుండి పోటీ చేసిన మేకా శేషుబాబు…నిమ్మల రామానాయుడు చేతిలో ఓడిపోయారు.