Saturday, May 10, 2025
- Advertisement -

2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో 2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందులో ఆఫీస్‌ సబార్డినేట్‌ 651, జూనియర్‌ అసిస్టెంట్‌ 230, కాపీయిస్ట్‌ 193, ప్రాసెస్‌ సర్వర్‌ 164, టైపిస్ట్‌ 162, స్టెనోగ్రాఫర్‌ 80, ఫీల్డ్ అసిస్టెంట్‌ 56, ఎగ్జామినర్‌ 32, డ్రైవర్‌ 28, రికార్డు అసిస్టెంట్‌ 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు https://aphc.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే ఐడీబీఐ బ్యాంక్‌ 676 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ మినహాయింపు ఉండనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -