వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జగన్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లని రాసి పెట్టుకోండి .. అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఖాకీ డ్రెస్ విలువ ఏంటో తెలిసేలా చేద్దాం అంటూ వివరించారు.
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి కానీ చంద్రబాబు కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు అన్నారు. జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని… ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారన్నారు. ప్రశ్నించకూడదని నిరంకుశత్వం, తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.
ఏనాడు మాట తప్పలేదు.. విలువలు వదల్లేదు అన్నారు జగన్. తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యేను అడుగు పెట్టనీయడం లేదు… మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది కానీ కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది అన్నారు. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు అందర్ని మోసం చేశాడు…ఇంకా మూడేళ్లు ఇలాగే గట్టిగా పోరాడుదాం..కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది అని భరోసానిచ్చారు జగన్.