డిస్టిలరీలు, మద్యం బ్రాండ్లు అన్నీ చంద్రబాబు తెచ్చినవే అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తెచ్చినవే అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోవడం మా తప్పే అని నేను భావిస్తున్నాను… మద్యం స్కాం జరిగినది అంటే అందులో భాగం అయిన ఎన్ని డిస్టిలరీల యజమానులను అరెస్టు చేశారు? చెప్పాలన్నారు.
ఆడబిడ్డ నిధి పథకం కోసం కాదు… ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ను ఫర్ సేల్ పెట్టేశాడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం పవన్ సినిమా టికెట్ల రేట్లును మాత్రం ప్రకటిస్తుందన్నారు. పవన్ పాలకుడు కాదని, టీడీపీ కోసం పోరాడే వ్యక్తని ఆయన విమర్శించారు. అమరావతిలో చేపలు పెంపకం బాగుంటుందని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ తన మీటింగ్‌లోనే తను అడ్మినిస్ట్రేటర్ కాదని పోరాటాలు మాత్రమే చేయగలడని చెప్పాడన్నారు. కాబట్టి పవన్‌ను ఆయుధంలా వాడుకుంటున్నారని భవిష్యత్‌లో పవన్ జీరో అవడం ఖాయమన్నారు.
