గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కింగ్‌డమ్. సితారా ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై పాన్ ఇండియా లెవల్లో జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా తాజాగా చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుపతిలో జూలై 28న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్‌లో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. తాజాగా టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.
విజయ్ దేవరకొండ సూరి అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, కౌశిక్ మహత వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
