మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. #Mega157, #ChiruAnil వర్కింగ్ టైటిల్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి “మన శంకరవరప్రసాద్ గారు” అనే టైటిల్ పెట్టారు. “పండగకి వస్తున్నారు” అనేది ట్యాగ్‌లైన్. టైటిల్ రివీల్ గ్లింప్స్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్కు టోన్ సెట్ చేసింది. చిరంజీవి కారులో పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తూ, సిగరెట్ వెలిగిస్తూ, తన ట్రేడ్ మార్క్ స్వాగ్ లో కమాండోల పక్కన నడుస్తుండగా గ్లింప్స్ ప్రారంభమవుతుంది. సిగరెట్ విసిరేస్తున్నప్పుడు టైటిల్ రివిల్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఫ్యాన్స్ ని మరింత సర్ ప్రైజ్ చేసింది.
మన శంకరవరప్రసాద్ గారు మెగాస్టార్ కే కాదు, అనిల్ రావిపూడి సిగ్నేచర్ స్టైల్ లో చిరంజీవిని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ అందించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవి ఎవర్ గ్రీన్ చరిస్మాని, స్టయిల్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ మెగా చరిస్మా అదిరిపోయింది. చివర్లో వచ్చే గుర్రం సీన్ అయితే మైండ్‌బ్లోయింగ్. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే “బాస్.. బాస్” చాంట్స్ క్యారెక్టర్ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్లేశాయి. అందులోనే మరో సర్ప్రైజ్ రౌడీ అల్లుడులోని కల్ట్ సాంగ్ లవ్ మీ మై హీరోను భీమ్స్ సిసిరోలియో కొత్తగా రీమిక్స్ చేయడం పక్కా నాస్టాల్జియా ఫీల్ ఇచ్చింది.ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది.
