- Advertisement -
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా రిలీజ్ అఫిషియల్‌గా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమా నాణ్యత విషయంలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు.
ప్రత్యేకంగా, రీ-రికార్డింగ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ కోసం మరింత సమయం అవసరమని తెలిపారు. ప్రేక్షకులకు అత్యుత్తమ థియేటర్ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
వాస్తవానికి తొలుత అఖండ 2ను సెప్టెంబర్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనలో అఖండ 2 తాండవం ఒక సినిమా కాదు, అది ఒక సినిమా పండుగ అంటూ చిత్ర బృందం అభిమానుల్లో మరింత ఉత్సాహం రేపింది.

