- Advertisement -

మా వందే..ప్రధాని బయోపిక్!

- Advertisement -

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ బర్త్ డే సందర్భంగా బయోపిక్‌ను ప్రకటించారు. “మా వందే” పేరుతో ప్రధాని మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. మోదీ పాత్రలో నటించనున్నారు ఉన్నిముకుందన్. నిర్మాతగా వీర్ రెడ్డి, దర్శకుడిగా క్రాంతికుమార్ వ్యవహరిస్తుండగా పలు భాషల్లో విడుదల కానుంది మోదీ బయోపిక్.

‘మార్కో’ అనే హిట్ చిత్రంతో గుర్తింపు పొందిన ఉన్నీ ముకుందన్, ఈ గొప్ప అవకాశాన్ని ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయపూర్వకంగా ఒక నోట్ రాశారు. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

నేను అహ్మదాబాద్‌లో పెరిగినప్పుడు ఆయనను మొదట మా ముఖ్యమంత్రిగా తెలుసుకున్నాను. అనేక సంవత్సరాల తరువాత, ఏప్రిల్ 2023లో ఆయనను ప్రత్యక్షంగా కలిసే అవకాశం రావడం నా జీవితంలో మరపురాని అనుభవం. ఆ సమయంలో ఆయన చెప్పిన రెండు మాటలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోయాయి. గుజరాతీలో ఆయన చెప్పినవి – “ఝూక్వాను నహీ” – అంటే “ఎప్పుడూ తల వంచవద్దు”. ఆ మాటలు నా జీవితంలోని ఎన్నో కష్టసమయాల్లో నాకు బలాన్నీ, ధైర్యాన్నీ ఇచ్చాయి. అని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -