- Advertisement -
వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో రజనీకాంత్. ప్రస్తుతం జైలర్ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు కమల్. ఈ సినిమా షూటింగ్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో జరుగుతోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన రజనీ…తన తర్వాతి సినిమా గురించిన అప్‌డేట్‌ని వెల్లడించారు. నా తదుపరి చిత్రం రాజ్ కమల్ బ్యానర్‌లో చేయబోతున్నాను… ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు అన్నారు.
అలాగే తాను, కమల్ కలిసి నటిస్తే చూడాలని చాలామంది ఆశపడుతున్నారు. మేము కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు కథ సెట్ అయినప్పుడు కలిసి నటిస్తాం అని మరోసారి స్పష్టం చేశారు రజనీ. ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి కథ, దర్శకుడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. దీనిపై త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం అంటూ రజనీ వెల్లడించారు.
