- Advertisement -

జగన్‌ అపాయింట్‌మెంట్ కోసం బాలయ్య!

- Advertisement -

జగన్ ఎందుకు సైకో? ఒక్కరోజైనా బసవతారకం ఆసుపత్రిని ఇబ్బంది పెట్టాడా? చెప్పాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మీడియాతో మాట్లాడిన నాని..జగన్ అపాయింట్మెంట్ కావాలని బాలకృష్ణ స్వయంగా నాకు ఫోన్ చేశాడు అన్నారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే బాలకృష్ణకు ఈర్ష్య, ద్వేషం అని మండిపడ్డారు. మెగా బ్రదర్స్ అంటే బాలయ్యకు పడదన్నారు. బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు మా బావ పెండింగ్ లో పెట్టారు అని హరికృష్ణ అనే అధికారితో బాలకృష్ణ చెప్తే వెంటనే జగన్ ఆ బిల్లులు క్లియర్ చేయించాడు అని గుర్తు చేశారు.

అఖండ సినిమా టైంలో బాలకృష్ణ నాకు కాల్ చేశాడు… టికెట్ రేట్ల విషయంలో సహకరించాలని మమ్మల్ని అఖండ నిర్మాత కోరారు అన్నారు. ఇదే విషయం జగన్ కి చెప్తే వాళ్లకు కావాల్సింది చేసేయండి అని చెప్పాడు అని గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -