తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై ఆ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. మదర్ డైరీ ఎన్నికల్లో మా జిల్లా నాయకులు కొంతమంది బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు… బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టొద్దు అని వ్యాఖ్యానించారు.
బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నారు… అపవిత్రమైన పొత్తులు విరమించుకోవాలి అన్నారు. ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి… మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలితే నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.
బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు వద్దు…మదర్ సిసి అధ్యక్షుడు ,మదర్ డైరీ చైర్మన్ మీకు బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ని బొందపెట్టవద్దు..మదర్ డైరీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే మదర్ డైరీ ముగ్గురు డైరెక్టర్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలను గెలిపించాలి చైర్మన్లు వేడుకుంటున్నాను… ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
