LSG సలహాదారుగా విలియమ్సన్‌

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాత్మక సలహాదారుడిగా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను నియమించింది ఆ జట్టు యాజమాన్యం. సంజీవ్ గోయంకా యాజమాన్యంలోని SA20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు విలియమ్సన్.

ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్టును తిరస్కరించిన ఐదుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లలో విలియమ్సన్ ఒకరు. ఈ మాజీ కెప్టెన్ ఇంకా ఏ ఫార్మాట్‌నుంచి రిటైర్ కాలేదు మరియు వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్‌కు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

లక్నో సూపర్ జెయింట్స్ సపోర్ట్ స్టాఫ్‌లో ఇప్పటికే మరో పెద్ద మార్పు చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో నాలుగేళ్ల పాటు పనిచేసిన భారత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా చేరారు. విలియమ్సన్ ఐపీఎల్‌లో 2015 నుంచి 2024 వరకు 10 సీజన్‌లలో ఆయన ఆడారు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 735 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. 2022 వరకు SRH తరఫున ఆడి, ఆ జట్టుకు కెప్టెన్సీ కూడా వహించిన ఆయనను 2023లో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో గాయంతో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడగలిగారు. 2024లో ఆయన రెండు మ్యాచ్‌లు ఆడారు. 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు జరిగిన ఆటగాళ్ల వేలంలో విలియమ్సన్‌ను ఎవరు కొనుగోలు చేయలేదు.