- Advertisement -

దుగ్గిరాల వైసీపీ నేత వీరయ్య అరెస్ట్

- Advertisement -

మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో జోరుగా బెల్ట్ షాపుల దందా సాగుతోంది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో కూల్ డ్రింక్ షాపుల పేరిట పెట్టారు బెల్ట్ షాపులు. బెల్ట్ షాపుల వ్యవహారం పై మండల పరిషత్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీశారు జడ్పిటిసి అరుణ.

ఈ నేపథ్యంలో దుగ్గిరాల వైసీపీ జెడ్పీటీసీ భర్త వీరయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం క్రితం గుంటూరులో బావను హత్య చేశారు బామ్మర్ధి. ఈ హత్య కేసుతో సంబంధం ఉందంటూ వీరయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు.

వైసీపీలో యాక్టివ్ గా ఉండటం వల్లే త‌న భ‌ర్త‌ను అక్రమంగా అరెస్ట్ చేశార‌ని జెడ్పీటీసీ అరుణ ఆరోపించారు. ఇటీవ‌ల దుగ్గిరాలలో బెల్ట్ షాపులపై మంత్రి నారా లోకేష్‌ను జెడ్పీటీసీ అరుణ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -