- Advertisement -

తెలంగాణ కేబినెట్‌లోకి అజార్..హోం శాఖ!

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్‌లోకి అజారుద్దీన్‌ను తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే అజార్‌కు అందించినట్లు తెలుస్తోంది. అజార్‌కు హోం మంత్రిత్వ శాఖతో మైనారిటీ వ్యవహారాల శాఖను కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎల్లుండి శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయనతో పాటు కోదండరామ్ పేరును కూడా గవర్నర్ కోటాలో ప్రతిపాదించారు. అయితే గవర్నర్ కోటాలో ప్రభుత్వం ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరామ్ ల పేర్లను గవర్నర్ ఇంకా ఆమోదించకుండానే అజారుద్దీన్ ను రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోనుండటం గమనార్హం.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మెజార్టీ సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికిప్పుడు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అజార్ భర్తీతో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -